Home » Pilot Dead during Flight: 34000 అడుగుల ఎత్తులో పైలట్ మృతి.. తృటిలో తప్పిన ప్రమాదం

Pilot Dead during Flight: 34000 అడుగుల ఎత్తులో పైలట్ మృతి.. తృటిలో తప్పిన ప్రమాదం

Pilot Dead during Flight: అమెరికాలోని సియాటెల్ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్తున్న విమానంలో పైలట్ గగనతలంలో మృతి చెందాడు. పైలట్ మరణించే సమయంలో విమానం 34,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విమానం టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. పైలట్ మరణంతో టర్కియే జాతీయ విమానయాన సంస్థ న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.


టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఏం చెప్పింది?
మంగళవారం సాయంత్రం పశ్చిమ యూఎస్ తీర నగరమైన సీటెల్ నుంచి విమానం బయలుదేరిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ట్విట్టర్‌లో రాశారు. “మా ఎయిర్‌బస్ 350లో పైలట్… సీటెల్ నుండి ఇస్తాంబుల్ వెళ్లే TK204 ఫ్లైట్ పైలట్ గాలిలో ఉన్న సమయంలో స్పృహతప్పి పడిపోయాడు. ప్రథమ చికిత్స అందించడానికి విఫలం కావడంతో కో-పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ల్యాండింగ్ కు ముందే పైలట్ మరణించాడు. ” అని రాసుకొచ్చాడు.


పైలట్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు
“మరణించిన పైలట్ వయస్సు 59 సంవత్సరాలు. అతను 2007 నుండి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాడు. అతను మార్చిలో వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు, ఇది ఎటువంటి ఆరోగ్య సమస్యల సంకేతాలను చూపించలేదు” అని ఉస్తున్ రాశారు. ఈ మొత్తం ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అత్యవసర ల్యాండింగ్ తర్వాత, రెండవ పైలట్ సహాయంతో విమానాన్ని ఇస్తాంబుల్, టర్కీకి తరలించారు. ఈ సమయంలో విమానం న్యూయార్క్ విమానాశ్రయంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *