Tripti Dimri : ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్‌ను సొంత చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ ఫేమ్ సొంతం చేసుకున్నా త్రిప్తి, ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు భారీగా బాలీవుడ్లో అవకాశాలు దక్కాయి. రీసెంట్గా విక్కీ కౌశల్ సరసన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రంలో లీడ్ పాత్రలో నటించింది. ఈ మూవీ 150కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఇక తన తదుపరి చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘యానిమల్’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు.
“‘యానిమల్’ విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. జోయా క్యారెక్టర్ చేసినందుకు నన్ను చాలామంది తిట్టారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా ట్రోల్ చేశారు. అవి ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని నేను కలలో కూడా అనుకోలేదు. మానసికంగా ఆవేదనకు గురయ్యాను. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నాను. దాని వల్ల బాధ కాస్త తగ్గింది, మనసు శాంతించగా, నా సోదరి ఎంతో సహాయంగా నిలిచింది. నువ్వు ఏం చేశావో తెలుసు, కాబట్టి ఇతరుల మాటలు పట్టించుకోకు అని నాకు ధైర్యం చెప్పింది.” అని తృప్తి డిమ్రి చెప్పుకొచ్చింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి జోయా పాత్రలో అలరించారు. స్టోరీ లో భాగంగా ఆమెపై కొన్ని ఇంటిమేట్ సీన్స్ చిత్రీకరించారు. ఆ సీన్స్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.