‘Vettaiyan’ Poor Advance Bookings, What Issues Are at Play
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది తలైవర్ కెరీర్లో 170వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ మూవీలో రజనీ సరసన మలయాళం హీరోయిన్ మంజు వారియర్ నటించనుంది. ‘జై భీమ్’ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
భారీ ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. దగ్గుపాటి రానా, రితిక సింగ్, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో అక్టోబరు 10న వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న ‘వేట్టయాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్, తమిళనాడులో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
కానీ తెలుగు రాష్ట్రాల్లో ‘వేట్టయాన్’ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టలేకపోతోంది. విడుదలకు ఒక్క రోజే ఉన్నా, కనీసం కోటి రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాధించలేదు, ఇందుకుగల కారణాలు ఏంటని విశ్లేషించగా ఈ అనూహ్య స్పందనకు అనేక కారణాలు ఉన్నాయి.
మొదటి కారణం టైటిల్. ‘వేట్టయాన్’ ది హంటర్ తమిళ టైటిల్‌ను యధావిధిగా అలాగే తెలుగులో పెట్టడం. తెలుగు ప్రేక్షకులు అంటే అంత చులకన అయ్యారు అనే భావన కొందరిలో ఏర్పడింది. దీనికి మరొక కారణం ‘ దేవర’ . ‘దేవర’ అన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ అందుకుంటున్నందువల్ల, ‘ వేట్టయాన్ ’కు ఆంధ్రలోని కొన్ని సెంటర్లలో థియేటర్స్ దక్కడం కష్టంగా మారింది. ఈ సవాళ్లు ఎదురుకుని ‘వేట్టయాన్’ హిట్ కొడితే తప్ప తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ అవడం కష్టం అనే చెప్పాలి.