Madugula Halwa: మాడుగుల హల్వా గురించి చాలా మంది వినే ఉంటారు.ద దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభనం అనగానే మాడుగుల నుంచి ప్రత్యేకంగా ఈ హల్వాను
తెప్పిస్తారు. ఆన్లైన్ ద్వారా కస్టమర్ల వద్దకే ఈ హల్వాను డెలివరీ కూడా చేస్తున్నారు. ఈ మాడుగుల హల్వాను తయారు చేసేందుకు నాలుగు రోజుల సమయం పడుతుంది. విశాఖపట్నం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ మాడుగుల అనే గ్రామం ఉంది. ఇక్కడ చేసే స్పెషల్ హల్వా చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తెలిసిన వారంతా శోభనం కోసం హల్వాను తప్పకుండా తెప్పించుకుంటారు. రాత్రి పెట్టే స్వీట్లలో మాడుగుల హల్వా ఉండాల్సిందే. ఈ స్వీట్ చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా ఎంతగానో నచ్చేస్తుంది. ఇది తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని సహజ పదార్థాలు వాడి తయారు చేసే ఈ హల్వా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని రుచి, వాసనతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రియమైన వంటకంగా నిలిచింది. ఈ హల్వా తయారీకి ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థాలు దాని తయారీ విధానం ఇతర హల్వాలకు చాలా తేడా ఉంటుంది.
ఆరోగ్య గుణాలే ఈ హల్వాకు ఉన్న డిమాండ్‌కు కారణం:
ఈ హల్వా తయారీలో ఆవు నెయ్యి, ఆరోగ్యవంతమైన వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, నాటు తేనె, మరియు గోధుమ పాలు ఉపయోగిస్తారు. ఈ హల్వా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసి, మాడుగుల ప్రాంతంలో శోభనం రాత్రి ప్రత్యేకంగా ఈ స్వీట్‌ను తినడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ హల్వా తింటే ఆరోగ్యంతో పాటూ బలం అని అందరికి తెలియడంతో ప్రాచుర్యం పొందింది. మామూలుగా హల్వా తయారీకి మైదా వాడతారు. లేదా రవ్వ లాంటి పదార్థాలూ ఉపయోగిస్తారు. కానీ ఈ హల్వా అందుకు పూర్తిగా భిన్నం. అన్నీ సహజ సిద్ధ, ఆరోగ్యకరమైన పదార్థాలే ఈ హల్వాలో ఉంటాయి.
మాడుగుల హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు:
బియ్యం: నాణ్యమైన బియ్యాన్ని ఉపయోగించడం వల్ల హల్వా రుచికరంగా ఉంటుంది.
చక్కెర: హల్వాకు తీపి రుచిని అందించే ప్రధాన పదార్ధం.
నెయ్యి: హల్వాకు ప్రత్యేకమైన వాసన, రుచిని ఇచ్చే పదార్థం.
పాలు: హల్వాను మృదువుగా చేస్తాయి.. .
పసుపు: హల్వాకు రంగును ఇచ్చే పదార్థం.
ఏలకులు: హల్వాకు రుచిని ఇచ్చే పదార్థం.
నట్స్: బాదం, పిస్తా వంటి నట్స్ హల్వా అందాన్ని పెంచుతాయి.
ఇప్పటి హల్వా కాదిది..
1890ల్లో దంగేటి ధర్మా రావు అనే వ్యక్తి ఈ హల్వాను మొదటగా తయారు చేశారట. ఆయన చేసిన ఈ హల్వా నూతన పెళ్లి దంపతులు తినే వంటకంగా మారుతుందని ఆయన కూడా అనుకుని ఉండరేమో. మొట్ట మొదలే ఇప్పుడు వాడుతున్న పదార్థాలతో తయారీ చేయలేదు. ముందు పాలు, గుమ్మడికాయ గుజ్జు వాడి దీన్ని తయారు చేశారు. క్రమంగా రకరకాల మార్పులు చేసి ఇప్పుడున్న హల్వా తయారు చేశారు. దాదాపు శతాబ్దం తర్వాత కూడా ఈ హల్వాకున్న ప్రాముఖ్యత తగ్గలేదు. ధర్మారావు వారసులు కూడా ఇప్పటికీ ఈ హల్వాను అమ్ముతున్నారు.