Shocking News: ప్రతి యువకుడికి తనకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. చాలాసార్లు సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు. తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకున్నందుకు తన కుటుంబాన్ని మొత్తాన్ని యువతి బలి తీసుకున్న ఉదంతం పొరుగు దేశం పాకిస్థాన్లోని కరాచీలో వెలుగు చూసింది. తన ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది. విషం కలిపిన ఆహారం తినడం వల్ల 13 మంది కుటుంబ సభ్యులు మరణించగా.. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగింది. తనకు నచ్చిన యువకుడితో పెళ్లికి కుటుంబం అంగీకరించకపోవడంతో ప్రియుడితో కలిసి యువతి ఈ కుట్ర పన్నినట్లు తెలిసింది.
కరాచీ పోలీసులు చెప్పేదేమిటంటే, అమ్మాయి కుటుంబం యువతి ఇష్టానుసారం ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడానికి సిద్ధంగా లేదు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ మరణాలు సంభవించాయి. నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో బాలిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడితో కలిసి తన తల్లిదండ్రులతో పాటు తన కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపడానికి కుట్ర పన్నారు. తినే ఆహారంలో విషం కలిపారు. అది తిన్న తర్వాత కుటుంబంలోని 13 మంది అస్వస్థతకు గురి కాగా..వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆస్పత్రిలో అందరూ ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఒకేసారి మృతి చెందడంతో కలకలం రేగింది. మృతులకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా.. అందరూ విషపూరిత ఆహారం కారణంగానే మరణించినట్లు తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా తెలిపారు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించగా, కూతురు, ఆమె ప్రేమికుడు ఆహారంలో విషం కలిపినట్లు తేలిందని చెప్పారు. మృతుల్లో గుల్ బేగ్ బ్రోహి, ఆయన భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులు ఉన్నారు.
దీంతో పోలీసులు నిందితురాలిని ఆదివారం అరెస్టు చేశారు. అమ్మాయి ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చిన అబ్బాయితో వివాహం చేయడానికి సిద్ధంగా లేనందున అమ్మాయి కోపంగా ఉందని పోలీస్ అధికారి ఇనాయత్ షా చెప్పాకు. దీనితో పాటు, పోలీసులు బాలికను విచారించగా, ఆమె ఆహారంలో విషం కలిపినట్లు అంగీకరించింది. యువతి ప్రియుడి కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. తన ప్రియురాలితో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డాడు