TG Teacher Appointment Letter: ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త ఈ నెల 9న నియామక పత్రాలు.. 10 కీలకాంశాలు
2024 డీఎస్సీకి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది.ఈ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి వారికి నియామక పత్రాలను అందజేయనున్నారు.
తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలను హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేయనున్నారు.. డీఎస్సీ 2024 సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం 4 p.m. CS శాంతికుమారి వెల్లడించారు.
10 ముఖ్యాంశాలు..
1. 10,000 మందికి పైగా ఉపాధ్యాయులకు నియామక పత్రాలను జారీ చేయనున్నారు.
2. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు.
3.సోమవారం సాయంత్రానికల్లా తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేయనున్నారు..
4.ఎంపికైన ఉపాధ్యాయులందరూ ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీ మైదానానికి చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.
5.ప్రతి బస్సులో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ ఆదేశించారు.
6.జిల్లాల నుంచి వచ్చే బస్సుల దగ్గర పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
7.అభ్యర్థులను స్టేడియం సమీపంలో దింపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు .
8. 9 న వర్షం పడే అవకాశం ఉన్నందున హైదరాబాద్ నగరంలో రెయిన్ ప్రూఫ్ షామియానా ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు.
9.ఉపాధ్యాయుల నియామక పత్రాలను అందజేసే కార్యక్రమానికి దరఖాస్తుదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది .
10.ఎల్బీ గ్రౌండ్స్ లో అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.