Actor Mohanraj: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణాది సినీ పరిశ్రమల్లో విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న మోహన్ రాజ్ కన్నుమూశారు. మోహన్ రాజ్ కేరళలోని తిరువనంతపురంలో గల తన నివాసంలో గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. తెలుగులో లారీ డ్రైవర్, శివయ్య, అసెంబ్లీ రౌడీ, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, తదితర సినిమాల్లో విలన్ గా మెప్పించారు. మోహన్ రాజ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు.
కొన్నే సంవత్సరాల క్రితం ఓ తెలుగు సినిమాలో యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా మోహన్ రాజ్ కాలికి గాయమైంది. ఆ గాయం ఆయన యాక్టింగ్ కెరీర్ ను దెబ్బతీసింది. ఆ గాయం నుంచి మోహన్ రాజ్ పూర్తిగా కోలుకోలేకపోయారు. 6 అడుగుల ఎత్తుతో బలంగా కనిపించే మోహన్ రాజ్ విలనిజం పండించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. . రెండేళ్ల కిందట మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘రోర్షాచ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ రాజ్ చివరిసారిగా నటించగా.. ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన అంత్యక్రియలు రేపు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు.