Home » Maoists: సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి

Maoists: సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి

Maoists lightning attack on CRPF camp in Bhadradri Kothagudem, Telangana

Maoists lightning attack on CRPF camp

Maoists: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుకుప్ప సీఆర్పిఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన బలగాలు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించడంతో మావోయిస్టులో వెనుతిరిగారు. గంటసేపు కొనసాగిని ఎదురుకాల్పులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పుసుగుప్ప గ్రామంలో సిఆర్పిఎఫ్ బేస్‌ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్ తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. క్యాంపు ఏర్పాటు చేసి నాటి నుంచి స్థానిక గిరిజనులు క్యాంపుకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు అయినప్పటికీ బేస్ క్యాంపును కొనసాగిస్తున్నారు.

Maoists lightning attack on CRPF camp in Bhadradri Kothagudem, Telangana
Maoists lightning attack on CRPF camp in Bhadradri Kothagudem, Telangana

ఈరోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మావోయిస్టు క్యాంప్ పై దాడి చేయడం జరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు సుమారు గంటవైపు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి అయితే ఈ ఘటనలో భద్రతా బలగాలలో ఎటువంటి ప్రాణస్టం గాని గాయాలు కానీ జరగలేదని తెలుస్తుంది గాయపడ్డారా లేదా అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *