తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బదులు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణా తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయబోతున్న బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర నాయకులు తుంగ బాలును అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ అరెస్టులు,జైలు జీవితాలు,దాడులు తెలంగాణకు కొత్తకాదని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నయవంచన కాంగ్రెస్ కు నాన కష్టాలు పడ్డా స్వరాష్ట్రం సాధించుకున్నాము.
పదేళ్లు తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలో ముందుండేలా అభివృద్ధి చేశాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన మూడో అధికరణ ను ఇచ్చిన అంబేద్కర్ కు ఘన నివాళిగా దేశంలో ఎత్తైన విగ్రహంను ఏర్పాటు చేశాము.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కాంగ్రెస్ పాలనలో మరణించిన తెలంగాణ బిడ్డల స్మరణకై అమరుల జ్యోతిని కూడా ఏర్పాటు చేశాము.అలాగే తెలంగాణ రాష్ట్ర పాలనకు హృదయం వంటి సచివాలయం ను 2023లో అత్యద్భుతమైన రీతిలో నిర్మించాము.అలాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనే లోపే ఎన్నికలు వచ్చాయి.ఆ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం యావత్తూ తెలంగాణ ప్రజలను అవమానించడమే.కష్టపడి చీమలు నిర్మించుకున్న పుట్టలో పాములు దూరినట్లు
మీ దుర్మార్గ పాలన ఉందని బీ.ఆర్.ఎస్.వి రాష్ట్ర నాయకులు తుంగ బాధపడ్డారు.అయినా కూడా చలి చీమల చేత పాములు అంతమైనవి అని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి.జ్ఞానం లేని సీఎం,అజ్ఞానపు కాంగ్రెస్ పాలన పై తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడానికి చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటామని తుంగ బాలు తెలిపారు.ఇప్పటికైనా కాలం మారినట్లు కాంగ్రెస్ నాయకులు బుద్ధి మారి,కక్ష్య సాధింపులు కాకుండా హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు.
Read Also
గాంధీ పాలన కాదు, గాడ్సే పాలన – తుంగ బాలు విమర్శలు (magicconnects.in)