last rites problems at graveyard in Kushaiguda
Kushaiguda: కుషాయిగూడ శాంతి వనంలో చావును కూడా శాంతిగా చేయలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుషాయిగూడ స్మశాన వాటిక పేరు శాంతివనమైనప్పటికీ మొత్తం అశాంతికి నిలయంగా మారిపోయింది. తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. ఎవరైనా చనిపోతే అంతిమ దహన సంస్కారాలు చేయాలంటే స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట దోచుకుంటారనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి ఒక్కో చావుకు రూ 25 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని కట్టేలతో అంతిమ దహన సంస్కారాలు చేస్తున్నారని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు మంగళవారం చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్మశాన వాటికలో ప్యాకేజీల పేరిట 25 వేల నుంచి 40 వేల రూపాయలు చెల్లించుకోలేక అనేక కుటుంబాలు గోసపడుతున్నాయని వివరించారు. కుషాయిగూడ (శాంతి వనం) స్మశాన వాటిక నిర్వహణ అధ్వానంగా ఉందని బాధితులు వాపోతున్నారు.