Revanth Reddy-KTR: రాజకీయాల్లో నిత్యం పరస్పరం విమర్శలు చేసుకునే సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
అన్ని పార్టీల ప్రతినిధులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానం పంపారు. సీఎం రేవంత్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెజస అధ్యక్షుడు కోదండరాం, పలు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేటీఆర్‌తో పాటు సీఎంకు కూడా ఆహ్వానాలు పంపామని, వారు హాజరవుతారని చెప్పారు. దీంతో ఇరు పార్టల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది రాజకీయ వేదిక కానందున కానందున ఒకే చోట కనిపించే సీఎం రేవంత్, కేటీఆర్ హుందాతనంతో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.