ఇది గాంధీ పాలన కాదు గాడ్సే పాలన-బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు తుంగ బాలు
మొన్న ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రుల కాన్వాయ్ పై,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు ఆఫీస్ పై,ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ప్రభుత్వమే దాడులు చేయడం చూస్తుంటే,ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అరెస్టులకు నిరసనగా ప్రజాస్వామ్య పద్దతిలో బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు నిరసన గళంవినిపిస్తున్న నన్ను (తుంగ బాలు) ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.ఈ అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ప్రజాపాలన కొనసాగించలేరు.నిర్బంధించడమే ప్రజాపాలన అనుకుంటున్నారా?
ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేద్దామనుకుంటున్నారా?పథకాలు అమలు పై ప్రశ్నిస్తే దాడులు,మీ మేనిఫెస్టో మీకు గుర్తు చేస్తే అక్రమ అరెస్టులు ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం?ఏమైపోతుంది ఈ తెలంగాణా?అని ప్రజలు గోస తీస్తున్నారు.గాంధీ పేరు పెట్టుకున్న అరికపూడి గాంధీ రౌడీయిజం, గాంధీ సిద్ధాంతాలతో వచ్చిన కాంగ్రెస్ గుండాయిజంతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని తుంగ బాలు తెలిపారు.గాంధీ పేరుతో ,గాడ్సే పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి వినాయకుడు ప్రసాదించాలని కోరుతున్నాము.
ప్రజాపాలన పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పుట్టగతులు కూడా ఉండవని తుంగ బాలు దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేని నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియని భయాందోళనలు జరగలేదని తుంగ బాలు వాపోయారు. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ రెడ్డి పాలన ఉందని ,లేకపోతే ఇవేం పనులు అని ఎద్దేవా చేశారు.ప్రజలు ఇంకా నాలుగేళ్లు ఈ నరకం తప్పదా అని నాన ఇబ్బందులు పడుతూ , కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలని ఎదురుచూస్తున్నారని తుంగ బాలు తెలిపారు.తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా పాలన చేయమని, డిల్లీకి చక్కర్లు కొట్టమని కాదని సీఎం రేవంత్ రెడ్డి యాదించికుకోవాలి.కాంగ్రెస్ పాలనలో ప్రజలకు శుష్కప్రియాలు , శూన్యహస్తా లు తప్ప ఏమి మిగలలేదని తెలిపారు.