హర్యానా ‘‘హస్త’’గతం.. బీజేపీ తిరోగమనం మొదలైందా..?
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. హర్యానాలో హ్యాట్రిక్ సాధించాలనుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తాకింది. అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే, కాంగ్రెస్ మెజారిటీ మార్క్ 46 కన్నా ఎక్కువ సాధిస్తుందని అంచనా వేశాయి. ఇక బీజేపీ 30 లోపే పరిమితమవుతుందని చెప్పాయి. మరో రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఎక్కువ స్థానాలు సాధిస్తుందని సర్వేలు చెప్పాయి. ప్రతీ సారి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావాలనే రూలేం లేదు. గతంలో అనేక సర్వేలు కూడా తలకిందులయ్యాయి. అక్టోబర్ 08న అసలు ఫలితాలు వెలువడుతాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ‘‘చార్ సౌ పార్’’ అంటూ బీజేపీ నినాదాలు ఇచ్చినప్పటికీ, మ్యాజిక్ మార్క్ 271ని కూడా సొంతంగా చేరుకోలేదు. 240 వద్దే బీజేపీ నిలిచింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలతో కలిపి 293 స్థానాలను గెలిచారు. వరసగా మూడోసారి నరేంద్రమోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. కాంగ్రెస్ గత రెండు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కాస్త పుంచుకుంది. 99 స్థానాలు సాధించి ఈ సారి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. మొత్తంగా ఇండియా కూటమి 234 స్థానాలను సాధించింది. ఆ సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ సొంతంగా బీజేపీ అధికారాన్ని చేపడుతుందని చెప్పాయి. కానీ పరిస్థితి తలకిందులైంది. లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్‌కి ఊపు ఇచ్చిన మాట వాస్తవం. దీంతోనే ఆ పార్టీ హర్యానాలో ప్రచారం చేసింది. దీనికి తోడు గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది.
హర్యానా ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటినప్పటికీ, యూపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు, అంటే 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. కేవలం 9 సీట్లను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 23 స్థానాలు సాధించిన బీజేపీ తాజా ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది.
శివసేన-బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి కేవలం 17 స్థానాలే గెలుచుకున్నాయి. ఇండియా కూటమి మాత్రం ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఇక్కడ బీజేపీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, వారి ఓట్ల శాతం తగ్గకపోవడం. చాలా చోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య ఇటీవల కాలంలో కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ, మళ్లీ కలిసిపోయినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్కి అడ్డాగా ఉన్న మహారాష్ట్రలో ఈసారి బీజేపీ ఎన్నికల ప్రదర్శన ఎలా ఉండబోతోందో చూడాలి.
Allu Arjun America Andhra Pradesh AP News AP Politics BJP Bollywood BRS Cinema Cinema News CM Chandrababu CM Revanth Reddy Congress Cricket Crime News Diwali Festival Donald Trump Entertainment Food Style Health Health News Health Tips Hyderabad India KTR Latest News Life Style Minister Gottipaati Ravi Kumar Movie News Naga Chaitanya Pakistan PM Modi Rashmika Mandanna Social Media Sports TDP Tech News technology Telangana Telugu News TG Politics Tollywood Wife YS Jagan YSRCP